భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ.పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
వైయస్ జగన్ మీడియా బ్రేకింగ్ పాయింట్స్
ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు
ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశానికి ఒక కేస్ స్టడీగా నిలుస్తాయి.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.. ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్ చేశారు.
శకుని మాయాపాచికల మాదిరిగా అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రిగ్ చేశారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, 143 హామీలతో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికలనే హైజాక్ చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు, అరెస్టులతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.
టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కై వైయస్ఆర్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
స్క్రూటినీ సమయంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
పోటీ నుంచి తప్పుకోవాలని బలవంతపు విత్‌డ్రావల్స్ చేయించారు.. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఓల వరకు ఒక మాఫియా ముఠాలా వ్యవహరించారు.
ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎస్ఈసీ సైతం చంద్రబాబుకు తొత్తుగా మారడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలే విఫలమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైయస్ఆర్సీపీ చైర్పర్సన్ అభ్యర్థులను నామినేషన్ వేయనీయలేదు.. మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ దశలోనే పోటీ లేకుండా చేశారు.
పులివెందులలో 40 వార్డులకు కేవలం 20 వార్డుల్లోనే వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు.. మిగిలిన వార్డుల్లో పోటీ లేకుండా చేశారు.
కాళ్లు చేతులు కట్టేసి పోటీలోకి దింపిన పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున వైయస్ఆర్సీపీ ఏజెంట్లను బూత్‌ల్లో కూర్చోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల కళ్ల ముందే టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితి.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఇలాంటి ఎన్నికలను అసలు ఎన్నికలు అని పిలవగలమా?