భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు!
భారత్–పాక్ సరిహద్దు సమీపంలో కలకలం.. పలు రైళ్లు రద్దు!
రాజస్థాన్: భారత్–పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని శ్రీగంగానగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సూరత్‌గఢ్–అనూప్‌గఢ్ రైల్వే మార్గంలో గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో ట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఈ పేలుడు ధాటికి పట్టాల కింద ఉన్న సిమెంట్ దిమ్మెలు (స్లీపర్లు) ధ్వంసమయ్యాయి. ట్రాక్ సమీపంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఘటన నేపథ్యంలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
సంఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సహా పలు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

సరిహద్దు ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు జరగడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.