భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం….నేడు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
జిల్లాలో మొత్తం 290 కౌంటింగ్ టేబుళ్లు.. 1,160 మంది కౌంటింగ్ సిబ్బంది ఏర్పాటు
అదనంగా 236 మంది రిజర్వ్ సిబ్బంది అందుబాటులో..
మచిలీపట్నం, నవంబరు 2:
కృష్ణా జిల్లాలో రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ, పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీలకు సంబంధించి రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ డి.కె. బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అవసరమైన కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ ఏర్పాట్ల వివరాలు:
- మచిలీపట్నం నగరపాలక సంస్థ:
- కౌంటింగ్ టేబుళ్లు: 168
- కౌంటింగ్ సిబ్బంది: 811 మంది
- పెడన మున్సిపాలిటీ:
- కౌంటింగ్ టేబుళ్లు: 57
- కౌంటింగ్ సిబ్బంది: 275 మంది
- ఉయ్యూరు మున్సిపాలిటీ:
- కౌంటింగ్ టేబుళ్లు: 65
- కౌంటింగ్ సిబ్బంది: 310 మంది

జిల్లా మొత్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు:
- మొత్తం కౌంటింగ్ టేబుళ్లు: 290
- కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది: 1,160 మంది
- అదనంగా రిజర్వులో ఉంచిన సిబ్బంది: 236 మంది
మొత్తంగా జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.