బంగాళాఖాతంలో మరింత బలపడిన మురసు తుఫాన్..!

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..బంగాళాఖాతంలో మరింత బలపడిన మురసు తుఫాన్..!

అర్ధరాత్రి దాటాక ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!

విశాఖపట్నం:

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుఫాను తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం.

ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నరసాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేడు, రేపు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. తుఫాను ప్రభావంపై వచ్చే తాజా హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.