భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఆ తదుపరి 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం,అండమాన్ సముద్ర ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 1, 2 తేదిల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తులను నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుందని తెలిపింది.
