భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం… ఎన్టీఆర్ జిల్లా :
తిరువూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డీఓ ఏ. కుమార్
తిరువూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ, డ్రైనేజీ కాలువల్లో పూడిక తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తీరం దాటిన అర్నబ్ తుఫాన్..