శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
లంబోదరో ధూమ్రవర్ణో
వికటో విఘ్ననాయకః।
సుముఖో దుర్ముఖో బుద్దో
విఘ్నరాజో గజాననః॥

శ్లోకార్థం:

లంబోదరో
పెద్ద పొట్ట కలవాడు
అన్నీ తనలో దాచుకునేవాడు!

ధూమ్రవర్ణో
పొగ రంగు కలవాడు
ధూమ్రం అంటే పొగ
అంటే ఏ రంగు అయినా ఆయనే!

వికటో
వికటంగా ఉన్నా అందమైనవాడు
వికారంలో కూడా సౌందర్యం చూపేవాడు!

విఘ్ననాయకః
విఘ్నాలకు నాయకుడు

విఘ్నాలను పెట్టేవాడు.
(మనం తప్పు దారిలో వెళ్తుంటే, మన మంచికే అడ్డంకి పెడతాడు!)

ఆటంకాలను తీసేవాడు కూడా ఆయనే!
(మనం చేసే మంచి, మరియు గొప్ప పనులకు కలిగే ఆటంకాలను తొలగించేవాడు కూడా ఆయనే!)

సుముఖో దుర్ముఖో
మంచి ముఖం కలవాడు
చెడు ముఖం కలవాడు కూడా ఆయనే!
అంటే మంచి చెడులు రెండూ ఆయనే!

బుద్దో
బుద్ధి స్వరూపుడు
తెలివికి అధిపతి!

విఘ్నరాజో గజాననః
విఘ్నాలకు రాజు
ఏనుగు ముఖం కలవాడు!
అంటే మన అడ్డంకులను తన పెద్ద చెవులతో విని
చిన్న కళ్ళతో పరిశీలించి
బలంతో తొలగించేవాడు!

ఈరోజు బుధవారం:

ఓం బుద్దాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
అని 21 సార్లు జపించండి.
స్వామి వారి అనుగ్రహానికి పాత్రులుకండి.

🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.🦜