కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కాటేదాన్‌లో కెమికల్ బ్లాస్ట్‌..

ఇద్దరికి గాయాలు

ఒకరి పరిస్థితి విషమం..

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స…

కాటేదాన్‌ లోని బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్‌ బ్లాస్ట్‌ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో సాయి అనే వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

అలాగే కాలిపాదం సగం మేరకు తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.