చిల్లర వివాదం.. బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన ప్రయాణికురాలు!

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..చిల్లర వివాదం.. బస్సులో నుంచి కండక్టర్‌ను తోసేసిన ప్రయాణికురాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిల్లర విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ ప్రయాణికురాలు బస్సు నుంచి కండక్టర్‌ను బయటకు తోసేసినట్లు సమాచారం.

అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికురాలితో వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో కండక్టర్ బస్సు నుంచి కిందపడగా, బస్సు టైర్ల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కండక్టర్ ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.