ఘంటసాల మండల జడ్పిటిసి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున దోవారి పవిత్ర నామినేషన్ దాఖలు చేశారు.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఘంటసాల మండల జడ్పిటిసి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున దోవారి పవిత్ర నామినేషన్ దాఖలు చేశారు.

మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దోవారి పవిత్ర నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

నామినేషన్ కార్యక్రమంలో పవిత్ర వెంట కూటమి పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు.

ఘంటసాల మండల జడ్పిటిసి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు.