దమ్మపేటలో గంజాయి, నాటు తుపాకీ స్వాధీనం.. ఆరుగురు అదుపులోకి

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్.: దమ్మపేటలో గంజాయి, నాటు తుపాకీ స్వాధీనం.. ఆరుగురు అదుపులోకి

4 కిలోల గంజాయి, నాటు తుపాకీ, వేట సామగ్రి, బైక్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొడిశాలగూడెం గ్రామంలో అటవీ జంతువుల వేటకు ఉపయోగించే నాటు తుపాకీ, వేట సామగ్రి, గంజాయి నిల్వ ఉన్నాయనే నమ్మదగిన సమాచారం మేరకు అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 4 కిలోల గంజాయి, ఒక నాటు తుపాకీతో పాటు వేట సామగ్రిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది జె. భద్రయ్య, ఏ. పార్వతి, పి. రాజరమేష్, ఈ. కాంతారావు, డి. నరేష్ కుమార్‌లు కొడిశాలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిలో రెండు బ్యాగుల్లో బ్రౌన్ కలర్ కవర్లలో చుట్టి ఉంచిన మూడు గంజాయి కట్టలు లభించాయి. ఇంటి బయట ఉన్న మోటార్‌సైకిల్ ట్యాంక్ కవర్‌లో మరో గంజాయి కట్టను గుర్తించారు. మొత్తం నాలుగు ప్యాకెట్లలో సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నాటు తుపాకీ, వేట సామగ్రి స్వాధీనం

తనిఖీల్లో వేటకు ఉపయోగించే ఒక నాటు తుపాకీతో పాటు మందుగుండు సామగ్రి, ఇనుప ముక్కలు, నల్ల పౌడర్, కత్తి, టార్చ్‌లైట్, సౌండ్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకీ పొడవు 35 సెంటీమీటర్లు, బ్యారెల్ పొడవు 55 సెంటీమీటర్లుగా గుర్తించారు. అదేవిధంగా చిల్లగుంపు గ్రామానికి చెందిన సున్నం మునేంద్రకు చెందిన పల్సర్ మోటార్‌సైకిల్ (నంబర్ TG 28 B 6782), ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురి వివరాలు

అటవీ అధికారుల అదుపులో ఉన్న వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

  1. పెనుబల్లి నాగు, తండ్రి కృష్ణయ్య, వయస్సు 23 సంవత్సరాలు, కొడిశాలగూడెం.
  2. పెనుబల్లి రవి, తండ్రి సూర్యబాబు, వయస్సు 21 సంవత్సరాలు, కొడిశాలగూడెం.
  3. తాటి సాయి కృష్ణ, తండ్రి రామ్మూర్తి, వయస్సు 23 సంవత్సరాలు, ఎర్రగుంపు.
  4. పెనుబల్లి శ్రీను, తండ్రి రాజులు, వయస్సు 28 సంవత్సరాలు, కుడిసెలగూడెం.
  5. తాటి నవీన్, తండ్రి వీరభద్రం, వయస్సు 25 సంవత్సరాలు, పాత గంగారం.
  6. సప్పిడి సమ్మయ్య, తండ్రి భాస్కర్, వయస్సు 29 సంవత్సరాలు, గార్లపేట.

తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానికంగా విక్రయం?

అధికారుల విచారణలో, కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోక చింతూరు, డొంకరాయి, సీలేరు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి స్థానికంగా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు, కొంత గంజాయిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నట్లు వారు తెలిపినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. గంజాయి మత్తులో అడవిలో జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తింటున్నట్లు కూడా వెల్లడించినట్లు తెలిపారు.

పంచనామా అనంతరం పోలీసులకు అప్పగింత

ఈ ఘటనపై దమ్మపేట మండల ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా సమాచారం అందించి, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పంచులుగా నియమించి నేర అంగీకార, స్వాధీన పంచనామా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

మందుగుండు సామగ్రి, ఇనుప ముక్కలు, నల్ల పౌడర్, కత్తి, టార్చ్‌లైట్, సౌండ్ బాక్స్
[20:14, 10/18/2026] ammiraju uday: ఏలూరు జిల్లా….

గంజాయి – సుమారు 4 కిలోలు, నాలుగు ప్యాకెట్లు

నాటు తుపాకీ – ఒకటి

వేట సామగ్రి కిట్ – ఒకటి

పల్సర్ మోటార్‌సైకిల్ – ఒకటి

సెల్‌ఫోన్లు – ఐదు