నేడు భారత్ – వెస్టిండీస్ చివరి టీ20 మ్యాచ్

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.నేడు భారత్ – వెస్టిండీస్ చివరి టీ20 మ్యాచ్

Bengaluru : నేడు భారత్ – వెస్టిండీస్ చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్ ను కైవసం చేసుకోవడానికి హోరాహోరీ తలపడ్డాయి.

ఇప్పటి వరకూ బారత్ – వెస్టిండీస్ జట్లు నాలుగు మ్యాచ్ లు ఆడి 2 -2 స్కోరుతో సమంగా నిలిచాయి. ఈరోజు బెంగళూరులో జరిగే మ్యాచ్ లో సిరీస్ ఎవరిదన్నది తేలనుంది.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా…టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరతితంగా కొనసాగుతుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ పరంగా బలంగా ఉంది. ఫుల్ ఫామ్ లో ఉంది. అదే సమయంలో భారత్ బ్యాటర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నా బౌలింగ్ లో తేలిపోతున్నట్లు కనిపిస్తుంది అయితే చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను చేజిక్కించుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా చివరి వరకూ హోరా హోరీ తలపడనున్నాయి. మరి సిరీస్ ఎవరిదో చూడాలి.