ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం..!ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం..!ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు!

విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్రపు అలలు ఓ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఏలూరుకు చెందిన కుటుంబ సభ్యులను జీవీఎంసీ స్విమ్మర్లు సాహసోపేతంగా రక్షించారు.

సముద్రంలో అలల ఉద్ధృతి మధ్య చిక్కుకున్న కుటుంబాన్ని గుర్తించిన స్విమ్మర్లు.. వెంటనే రంగంలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సముద్రంలోకి వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి దిగవద్దని సూచిస్తున్నారు….