భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..ఇస్లాంలోకి మారితే బీసీ రిజర్వేషన్లు వర్తించవు: సుప్రీం కోర్ట్
న్యూ ఢిల్లీ :
ఇస్లాంలోకి మారిన వారికి బీసీ రిజర్వేషన్లు పొందే అర్హత లేదని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ సామాజికవర్గం నుంచి మతమార్పిడి చేసుకున్న వారు ఈ రిజర్వేషన్ల లబ్ధి పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్ట్ తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్ లతో కూడిన ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తూ ఈ తీర్పును వెలువరించింది.
