భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నేటి నుంచి ఎస్ఐర్ స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీవెరిఫికేషన్!
అమరావతి :
ఏపీ రాష్ట్రంలో గురువారం నుంచి ఎస్ఐర్(SIR)స్పెషల్ డ్రైవ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 46.62 లక్షల ఓటర్ల వివరాలను అధికారులు మరోసారి వెరిఫై చేయనున్నారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డూప్లికేట్ నమోదైన ఓటర్లను తొలగించినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు.

బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి పరిశీలన అనంతరం అర్హులైన వారి పేర్లను నిరంతర సవరణలో చేరుస్తారు. పొరపాటున తొలగించిన వారు ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 16న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు..