హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు…

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..హాయిగా నిద్రపోవడమే పోటీ.. గెలిస్తే రూ.12లక్షలు…

జపాన్లో ఓ వినూత్న పోటీ జరిగింది. నిద్రలేమితో బాధపడుతున్నవారికి అవగాహన పెంచేందుకు ‘కోలా స్లీప్ జపాన్’ అనే సంస్థ టోక్యోలో ‘మ్యాట్ రేస్’ పేరుతో స్లీప్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్నవారు 90 నిమిషాలు పరుపులపై నిద్రపోయారు. స్లీప్ ట్రాకింగ్ ద్వారా ఎవరు వేగంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనే దాని ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఇందులో ‘సుయిమీ’ అనే మహిళ గెలిచి రూ.12లక్షలు (2M యెన్లు) పొందారు…