భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మంచిర్యాల జిల్లా:
కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత… గిరిజనులపై విచక్షణారహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు…
అటవీ భూమిలో పట్టు పురుగుల సాగు (సెరికల్చర్) చేసుకుంటున్న అమాయక గిరిజనులను అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బంది…
అటవీ అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన గిరిజనుడు చింతల లస్మయ్య…
అపస్మారక స్థితిలో ఉన్న లస్మయ్యను అత్యవసరంగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, స్థానికులు…
ప్రస్తుతం చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో లస్మయ్యకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స… పరిస్థితి విషమం…
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గిరిజన సంఘాల మండిపాటు…

దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజనులు, గ్రామస్తుల డిమాండ్…