హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹2.25 కోట్ల విదేశీ బంగారం సీజ్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ₹2.25 కోట్ల విదేశీ బంగారం సీజ్

హైదరాబాద్ ఆర్‌జీఐఏలో డీఆర్‌ఐ అధికారులు 1,481.780 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ₹2.25 కోట్లు.

తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి తనిఖీలో ఆరు బంగారం ముక్కలు బయటపడ్డాయి. బ్లూ టేప్, కార్బన్ పేపర్‌తో చుట్టి.. దుస్తుల కింద ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లో బంగారాన్ని దాచినట్లు గుర్తించారు.

నిర్దిష్ట సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశీ ప్రయాణ దశలో విమానంలోనే బంగారాన్ని దాచినట్లు.. హైదరాబాద్‌కు వెళ్లే దేశీయ ప్రయాణంలో దాన్ని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

విమానంలో దాచిన బంగారాన్ని తానే తీసుకున్నట్లు ప్రయాణికుడు విచారణలో చెప్పినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్, 1962 కింద బంగారాన్ని సీజ్ చేసి.. అక్టోబర్ 6న ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.