భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మానవత్వం లేని మాల్స్ – సేల్స్ బాయ్స్, గర్ల్స్ ఆవేదన ఎవరు పట్టించుకుంటారు?
జీవీ మాల్ కావచ్చు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కావచ్చు, సీఎంఆర్, చెన్నై షాపింగ్ మాల్, వస్త్రలత, చందనా బ్రదర్స్, కళాంజలి… పేరేదైనా కావచ్చు. లోపల సీన్ మాత్రం ఒక్కటే.
ఉదయం 9-10 గంటల నుండి రాత్రి 9-10 గంటల వరకు సేల్స్ బాయ్స్, గర్ల్స్ నిలుచునే ఉండాలి. కూర్చోవడానికి వీలు లేదు. యాజమాన్యం ఒప్పుకోదు.
ఇదెక్కడి అన్యాయం?
సేల్స్ లో ఉండడం ఏమైనా పనిష్మెంటా? వాళ్లు మనుషులు కాదా? యంత్రాలా? వాళ్ల కాళ్లు నొప్పి పుట్టవా? 12 గంటలు నిలబడితే కాళ్లు ఎలా ఉంటాయి?
డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్ల నొప్పులతో విలవిలలాడుతున్న సేల్స్ బాయ్స్, గర్ల్స్ ఎంతోమంది ఉన్నారు. వారి బాధ, వారి నొప్పులు ఎవరు పట్టించుకుంటున్నారు?
దయ, దాక్షిణ్యం, మానవత్వం మాల్స్ యాజమాన్యాలకు లేదా?
కస్టమర్ వస్తే నిలబడి సేవ చేయడం తప్పు కాదు. కానీ కస్టమర్ లేనప్పుడు కూడా కూర్చోనివ్వకుండా చేయడం ఏంటి? కూర్చుంటే జీతం కట్, ఉద్యోగం పోతుంది అనే భయం.
ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదు?

మానవ హక్కులు ఏమయ్యాయి? లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? కోర్టులు ఏమంటున్నాయి?
ఈ రూల్స్ మారాలి.
మా డిమాండ్:
- ప్రతి సేల్స్ స్టాఫ్ కి కూర్చునే హక్కు ఉండాలి. కస్టమర్ లేనప్పుడు కూర్చునేందుకు స్టూల్ ఏర్పాటు చేయాలి.
- మానవ హక్కుల కమిషన్ ముందుకు రావాలి.
- ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం జీవో పాస్ చేయాలి – 12 గంటలు నిలబెట్టడం నేరం అని.
- కోర్టులు వారికి న్యాయం చేయాలి.
వాళ్లు కూడా మనుషులే. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ల నొప్పిని అర్థం చేసుకోండి. మానవత్వం చూపండి.
సేల్స్ బాయ్స్, గర్ల్స్ కు కూర్చునే హక్కు కావాలి!