భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
రాష్ట్ర అధ్యక్షుడిగా గిరి యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పి. విష్ణు ఎన్నికయ్యారు.
రాష్ట్ర కార్యదర్శిగా వట్టెం గ్రామానికి చెందిన సమీర్ బాబా ఎన్నికయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు.
నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర కమిటీలో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన విష్ణు, సమీర్ బాబా లకు కీలక బాధ్యతలు దక్కడంపై జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.