హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ చర్యలు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ చర్యలు

మాదాపూర్‌, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు TG SAFE అధికారులు తెలిపారు.

⚠️ 11 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్ చేసి, వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

📍 జాబితాలో ఉన్నవి:

  • Monastery – Hitec City
  • Shivani The Restaurant & Bar – Gachibowli
  • Al Saba Restaurant – Gachibowli
  • Lucky Multicuisine Restaurant – Madhapur
  • Sai Ram Mess – Madhapur
  • Udupi’s Upahar – Gachibowli
  • Coal Spark Multi Cuisine Restaurant – Hitec City
  • Kanchi Cafe – Hitec City
  • AnTeRa Kitchen & Bar – Gachibowli
  • Am Aha Telugu Kitchen & Bar – Inorbit Mall
  • Fusion 9 / Amnesia Sky Bar – Inorbit Mall, Madhapur

🔎 అధికారుల ప్రకారం కొన్ని చోట్ల:
❌ గడువు ముగిసిన / పాడైన ఆహార పదార్థాలు
❌ బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు
❌ ఫంగస్ సోకిన కూరగాయలు, ఆహార పదార్థాలు
❌ సరైన నిల్వ విధానాలు లేకపోవడం
❌ అపరిశుభ్రమైన వంటగదులు
❌ డ్రైనేజీ, శుభ్రత సమస్యలు
వంటి ఉల్లంఘనలు గుర్తించారు.

🧪 తనిఖీల్లో 21 ఆహార నమూనాలను కూడా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

📌 గమనిక: ఇది “లైసెన్సులు శాశ్వతంగా రద్దు” చేసినట్లు కాదు. అధికారికంగా FSSAI లైసెన్సుల suspension (సస్పెన్షన్) మరియు కార్యకలాపాలు నిలిపివేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.