భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంసెప్టెంబర్ 28 నుంచి 5 రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం….
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి, ఆ తర్వాత ఆదివారం సెలవు దినాలు కావడంతో బ్యాంక్ శాఖలు మూసివేయబడతాయి. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి