అయోధ్యలో నేటి నుంచే కొత్త సీఈవో బాధ్యతలు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..అయోధ్యలో నేటి నుంచే కొత్త సీఈవో బాధ్యతలు

అయోధ్య :

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈవోగా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో పరిపాలనలో పారదర్శకత, భద్రత, భక్తుల సౌకర్యాలను పెంచేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన ఇకపై ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ దైనందిన వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ, వ్యవస్థను సమీక్షించి అవకతవకల నిరోధానికి నూతన సంస్కరణలు చేపట్టనున్నారు