ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పెంపు.

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పెంపు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది.ఏ4 (A4) మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ గడువు పెంపు చేసినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం దుకాణాలు నోటిఫై అయ్యాయి.ఈ దుకాణాల రెన్యువల్, వార్షిక ఆర్ఈటీ (RET), పర్మిట్ రూమ్ ఆర్ఈటీ కలిపి మొత్తం రూ.3,637.35 కోట్ల వార్షిక డిమాండ్ ఉంది. అయితే, ఇప్పటివరకు మొత్తం రూ.1,179.63 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులువెల్లడించారు.గడువుపొడిగింపుతో మిగిలిన మద్యం దుకాణాల యజమానులు తమ రెన్యువల్,ఆర్ఈటీ, పర్మిట్ రూమ్ ఆర్ఈటీ బకాయిలను చెల్లించేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.