అక్టోబర్ 5 న మద్యం షాపులకు లాటరీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అక్టోబర్ 5 న మద్యం షాపులకు లాటరీ

క్రైమ్ న్యూస్ కృష్ణా :

ఎక్సై పాలసీ 2024-26 కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న 135 మద్యం షాపులకు గాను 100 షాపులు 2026-27 సంవత్సరమునకు రెన్యువల్ అయినవి. మిగతా 35 షాపుల లాటరీ 05-10-2026 వ తేదీ ఉదయం 08:00 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణాజిల్లా వారి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్, కలెక్టరేట్, మచిలీపట్నం నందు నిర్వహింపబడుతున్నది.

ప్రతి షాపునకు కనీసం నాలుగు అప్లికేషన్లు వచ్చిన ఎడల ఆ షాప్ లాటరీ తీయబడును. ప్రతి అప్లికేషన్కు రూ.3,00,000/- మరియు ప్రాసెసింగ్ ఫీ రూ.1000/- చెల్లించి లాటరీ లో పాల్గొనవచ్చు. లాటరీలో షాప్ పొందుకున్న వారు అదే రోజున వార్షిక లైసెన్స్ ఫీజులో నాలుగవ వంతు మరియు పర్మిట్ రూమ్ ఫీజును తప్పనిసరిగా కట్టవలెను. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని షాపుల పర్మిట్రూమ్ ఫీజు రూ. 7,50,000/- నగర పంచాయతీ మండల పరిధిలోని షాపుల పర్మిట్ రూమ్ ఫీజు రూ.5,00,000/-, పర్మిట్ రూమ్ ఫీజు 3 ఇన్స్టాల్మెంట్లలో కట్టుకోవచ్చు.

వార్షిక లైసెన్స్ ఫీజులు రెండు స్లాబులలో కలవు. మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీలకు 71,50,000/- అలాగే నగరపంచాయతీ మరియు మండల పరిధిలకు 60,50,000/-, షాపుల వివరములు ఏమనగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 3 మచిలీపట్నం మండలం -1 పెడన మున్సిపాలిటీ -1 పెడన మండలం -2 కోడూరు మండలం -1 మోపిదేవి మండలం -1 ఘంటసాల మండలం-1 గుడివాడ మున్సిపాలిటీ -2 గుడివాడ మండలం-1 పామూరు మండలం -2 గుడ్లవల్లేరు మండలం -3 పెదపారుపూడి మండలం -1 గన్నవరం మండలం -2 బాపులపాడు మండలం -2 ఉంగుటూరు మండలం -1 ఉయ్యూరు నగర పంచాయతీ -3 ఉయ్యూరు మండలం -2 పమిడిముక్కల మండలం -1 కంకిపాడు మండలం -4 పెనమలూరు మండలం -1.

అప్లికేషన్లు ఆన్లైన్ వెబ్సైట్ https://oc.hpfsproject.com ద్వారా లేదా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం మచిలీపట్నం లేదా జిల్లాలోని ఎనిమిది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లు మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ, మొవ్వ, గుడివాడ, నందివాడ, గన్నవరం, ఉయ్యూరు లో సమర్పించవచ్చు. మరిన్ని వివరములకు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయము మచిలీపట్నం నందు స్వయంగా గాని లేదా 8466981837 నెంబర్ ద్వారా సంప్రదించగలరు.

జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి