భారత్ డిజిటల్ న్యూస్ భక్తిశ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌹🙏🌹🦢🦚
వీరధ్వంసో విశ్వమూర్తి
ర్విశ్వరూపో వరాసనః।
విశాఖో విమలో వాగ్మీ
విద్వాన్వేద ధరో వటుః॥
శ్లోకార్థం:
ఈ శ్లోకంలో ప్రతి నామం “వ” కారంతో మొదలవడం విశేషం, “వ” కారమే “శక్తి” బీజం!
వీరధ్వంసః
వీరుల గర్వాన్ని అణిచేవాడు, తారకాసురుడి లాంటి రాక్షసులని
విశ్వమూర్తిః, విశ్వరూపః
ఈ విశ్వమే తన రూపంగా కలవాడు

వరాసనః
శ్రేష్ఠమైన ఆసనంలో కూర్చున్నవాడు
విశాఖః
విశాఖ నక్షత్రంలో జన్మించినవాడు, పార్వతీ పరమేశ్వరుల కుమారుడిని, ఆరుగురు కృత్తికలు, పాలిచ్చి, పెంచి పెద్ద చేశారు, వారికీ తనయుడైన స్వామివారికి, ఆరుగురు తల్లుల నక్షత్రమైన “కృత్తికా” నక్షత్రం అత్యంత ప్రియమైనది.
విమలః
మలినం లేనివాడు, స్వచ్ఛమైనవాడు
వాగ్మీ
మాటల్లో నేర్పరి, జ్ఞానాన్ని బోధించేవాడు
విద్వాన్, వేదధరః
సర్వ విద్యలు తెలిసినవాడు, వేదాలను ధరించినవాడు
వటుః
బ్రహ్మచారి రూపంలో ఉండేవాడు, సుబ్రహ్మణ్యుడు సత్బ్రహ్మచారి.
శ్లోక భావార్థం:
సుబ్రహ్మణ్యుడు దేవ సేనాపతి. యుద్ధంలో ముందుంటాడు. “వీరధ్వంసః” మీలోని భయాన్ని, బలహీనతను పోగొట్టేవాడు.
అలాగే “విమలః” మీ శరీరంలో ఉన్న మలినాలను, షుగర్, BP వల్ల వచ్చే చెడును తొలగించేవాడు.
ఈరోజు మంగళవారం, “ఓం విమలాయ నమః” అని 11 సార్లు జపించండి. శరీరం, మనస్సు రెండూ శుద్ధి అవుతాయి.
🪷మిత్రులకు,భౌమవాసర శుభోదయం.🪷