ముద్ర రుణ పథకానికి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు కొనసాగింపు!

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ముద్ర రుణ పథకానికి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు కొనసాగింపు!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) పథకాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. 2031 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది.

ముఖ్యమైన వివరాలు:

  • అర్హత కలిగిన సూక్ష్మ సంస్థలకు ముద్ర పథకం కింద రూ.20 లక్షల వరకు రుణాలకు గ్యారెంటీ కవరేజీ.
  • రూ.5,000 కోట్ల కార్పస్‌తో రూ.12.6 లక్షల కోట్ల రుణాలకు తోడ్పాటు.
  • జనధన్ ఖాతాలపై బ్యాంకులు ఇచ్చే రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌లకు గ్యారెంటీ.
  • స్వయం సహాయక సంఘాల (SHG) రుణాలకు కూడా గ్యారెంటీ కవరేజీ.
  • గ్యారెంటీ ఫీజును ఏడాదికి 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింపు.
  • 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల వరకు ఈ పథకం వర్తింపు.

ఇప్పటివరకు భారీగా రుణాలు పంపిణీ!

2026 సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 60.36 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.43.34 లక్షల కోట్లు.

చిన్న వ్యాపారులకు ప్రయోజనం!

ఈ నిర్ణయంతో చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రుణ సదుపాయాలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పూచీకత్తు లేకుండా రుణాలు పొందేందుకు ఈ పథకం దోహదపడనుంది.