ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

గుంటూరు :

గుంటూరు GGHలోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక జన్యు పరీక్షా ల్యాబ్ ను ఎల్లుండి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు.

ఏపీలో ఇదే తొలిసారి. భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

ఈ ల్యాబ్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో కీలక పురోగతి సాధించనుంది.

గుంటూరు జీజీహెచ్లో రూ.2.5 కోట్లతో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి సత్య కుమార్ ప్రారంభించనున్నారు.

తొలి విడతలో బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్ రోగుల నమూనాలను పరీక్షించి, జన్యు మార్పుల ఆధారంగా చికిత్స అందించనున్నారు.

ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ సేవలు కొనసాగనున్నాయి.