భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఏపీలో 2,111 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో 2,111 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో 906 స్కూల్ అసిస్టెంట్, 1,205 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ఆన్ లైన్స్ దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికైన వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్షను డిసెంబర్ 20, 2026 నుండి జనవరి 13, 2027 వరకు నిర్వహిస్తారు. విద్యార్హత, ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు….