శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌹🙏🌹🦢🦚
జనార్దనో జనానందో
నరో నారాయణో(అ)ఽంబుదః।
సందేహనాశనో వాయుర్ధన్వీ
సుర నమస్కృతః॥

శ్లోకార్థం:

జనార్దనః
జనుల కష్టాలను నాశనం చేసేవాడు

జనానందః
జనులకు ఆనందాన్ని ఇచ్చేవాడు

నరో నారాయణః
నరుడు, నారాయణుడు కూడా తానే అయినవాడు

అంబుదః
మేఘం వంటివాడు, నీటిని ఇచ్చేవాడు (వర్షం)

సందేహనాశనః
సందేహాలను, అనుమానాలను పోగొట్టేవాడు. సూర్యుడు ఉదయిస్తే చీకటి పోయినట్లు!

వాయుః, ధన్వీ
వాయు రూపుడు, ధనస్సు ధరించినవాడు

సుర నమస్కృతః
దేవతలందరూ నమస్కరించేవాడు

ఈరోజు ఆదివారం ఉదయం సూర్యునికి నమస్కారం చేస్తూ “ఓం సందేహ నాశనాయ నమః” అని జపించండి. సూర్యనారాయణుని అనుగ్రహాన్ని పొందండి.

ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🙏

🪷మిత్రులకు,భానువాసర శుభోదయం.🪷