సర్వం భక్తిమయం

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి….సర్వం భక్తిమయం

భారతీయ జీవన విధానంలో భక్తి ఒక శాఖగా విస్తరించింది. ‘భక్తి’ అనే భావనలోనే జ్ఞాన, కర్మ, యోగాది సాధనలన్నీ అంతర్లీనమై ఉన్నాయి. బ్రహ్మానందానుభవం భక్తి పారవ శ్యంలోనే కలుగుతుందని వేదాంతం చెబు తోంది. ప్రేమ, సేవ అనే రెండూ భక్తికి అంగాలే. మన జీవితంలోని ప్రతి అంశం లోనూ భక్తిని మిళితం చేసుకోవచ్చు.

పండుగల్లో మనం ఇంట్లో చేసుకుతినే కొన్ని ప్రత్యేక వంటకాలు దైవానికి నైవే ” ద్యంగా పెట్టి మనం తింటే అది ప్రసాదమ వుతుంది. ప్రసాదమనగానే ఆహారాన్ని వ్యర్థం చెయ్యం. ఆహారానికి భక్తిని జోడిస్తే అది ప్రసాదం. ఎంతో పవిత్రం. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తాంత్రిక పూజావిధా నంలో మాంసాహారమూ ప్రసాదమవుతుంది. మనం రోజూ తాగే నీరే అయినా అది మామూలు జలమైనా, కొబ్బరి నీళ్లయినా ఆలయంలో అర్చకుడిస్తే తీర్థమవుతుంది. జలాశయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల సమీ పంలో ఉంటే అవి పుణ్యతీర్థాలు. అక్కడ పవిత్రస్నానాలు ఆచరిస్తారు. ఆకలిని లెక్క చెయ్యకుండా నిరాహారంగా ఉండటానికి భక్తి తోడైతే, అది ఉపవాసం. భగవంతుడిపై చిత్తం నిలిపే క్రమంలో ఆహారం తయారుచే సుకోవడం, తినడం, రుచిని ఆస్వాదించడం వంటివి అవరోధాలు గనుక భక్తిలో నిరాహా రంగా ఉండటానికి ప్రాధాన్యం ఏర్పడింది. అప్పుడప్పుడూ ఆచరించే ఉపవాసాలు దేహా రోగ్యానికీ మేలు చేస్తాయి. మన ఆధ్యాత్మిక చింతనలో ఆరోగ్య స్పృహా దాగి ఉంది..