భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత

Ammiraju Udaya Shankar.sharma News Editor…దసరా ఉత్సవాల నిమిత్తం భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరామత్తుపనులు చేపట్టే క్రమంలో సెప్టెంబర్ 22 ఉదయం నుండి వారం రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయుటకు నిర్ణయించడమైనది.
ఈ వారం రోజులు శ్రీ కనకదుర్గానగర్ మార్గం నుండి భక్తులు దేవస్థానం నకు చేరుకోవలసియున్నది.
హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకొని, అక్కడ నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్ ద్వారా దేవస్థానమునకు చేరుకోవచ్చని, విశాఖపట్నం, చెన్నయ్ తదితర ప్రాంతాల నుండి వన్ టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాలు వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకొని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్ ద్వారా దేవస్థానమునకు చేరుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ తెలిపారు.

ఈ వారం రోజులు పార్కింగ్ ప్రదేశాలు నుండి దేవస్థానంనకు ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేసామని, భక్తులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.