భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంఏపీలో హోంగార్డులకు శుభవార్త
రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 10శాతం ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు ఈ కేటగిరీలో డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
ఇతర ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని అందులో పేర్కొంది. దీనివల్ల ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్లో హోంగార్డులకు ప్రయోజనం చేకూరనుంది.

కానిస్టేబుల్ స్టయిఫండరీ ట్రైనీ (డ్రైవర్) ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను దక్కించుకునేందుకు ఉపయోగపడనుంది.