భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో 41 మంది కొత్త సివిల్ జడ్జీలకు శిక్షణ ప్రారంభం
41 మంది కొత్త సివిల్ జడ్జీలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయపరమైన ఆలోచనలో కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రత్యామ్నాయం లేదని ఆమె స్పష్టం చేశారు. నిజాయితీ, చిత్తశుద్ధి, మంచి వ్యక్తిత్వంతో విధులు నిర్వహించాలని జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు.
