శ్రీ పవన్ కళ్యాణ్ గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శ్రీ పవన్ కళ్యాణ్ గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందించారు.