భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పైలట్ స్మిత్ ఫ్యామిలీతో మాట్లాడిన ప్రధాని మోదీ….
ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన స్మిత్ ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు.

కుటుంబానికి భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు స్మిత్‌ను ‘హీరో’గా అభివర్ణిస్తూ మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడి సౌదీలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు….