భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సెర్ప్ – ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం
సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తేదీలో మార్పు
పెన్షన్ల పంపిణీ:
📅 01 అక్టోబర్ 2026 (గురువారం)
⏰ మధ్యాహ్నం 12:00 గంటల నుండి
యూఎఫ్బీయూ (బ్యాంక్ యూనియన్ల సమాఖ్య) 28 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ నగదు ఉపసంహరణను 01 అక్టోబర్ 2026 ఉదయం నిర్వహించాలని నిర్ణయించారు.
అందువల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 01 అక్టోబర్ 2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రారంభమవుతుంది.
పెన్షనర్లు ఈ మార్పును గమనించి, 01 అక్టోబర్ 2026 మధ్యాహ్నం 12 గంటల తర్వాత తమ పెన్షన్ను పొందవచ్చు.
– సెర్ప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మెమో తేదీ: 25-09-2026
