ఏపీలో స్థానిక ఎన్నికలు: 100 మున్సిపల్‌ సంస్థలకు ఓటర్ల జాబితాలు సిద్ధం.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీలో స్థానిక ఎన్నికలు: 100 మున్సిపల్‌ సంస్థలకు ఓటర్ల జాబితాలు సిద్ధం….

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే 59 మున్సిపల్‌ స్థానిక సంస్థలకు ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ స్టేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. తాజాగా మరో 41 సంస్థలకు ఫొటో ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి.

దీంతో మొత్తం 100 మున్సిపల్‌ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన కీలక ప్రక్రియ పూర్తయింది. మరో 23 మున్సిపల్‌ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు కేసులపై స్పష్టత వచ్చిన తర్వాత ఆయా సంస్థల ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది…