భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలం పొడిగింపు
అమరావతి :
ఏపీ రాష్ట్రంలోని 86 అర్బన్ లోకల్ బాడీల్లో స్పెషల్ ఆఫీసర్ల పదవీకాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇందులో 11 నగర పాలక సంస్థలు (కార్పొరేషన్లు), 75 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలు ఉన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అమలులోకి వచ్చేలా 6 నెలల పాటు లేదా ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టే వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
