భారీ వర్షాల నేపథ్యంలో కోడూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..భారీ వర్షాల నేపథ్యంలో కోడూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు

తహసీల్దార్ పూర్ణచంద్రరావు

కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోడూరు మండల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ పూర్ణచంద్రరావు తెలిపారు.

గురువారం స్థానిక పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని తహసీల్దార్ సూచించారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో వీఆర్వోలు అందుబాటులో ఉంటారని, గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని, అత్యవసర సమయంలో 960 3578190, 9959921804,9989843680 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాల్సిందిగా తాసిల్దార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.