భద్రాచలంలో యువకుడిని కొట్టి చంపిన లాడ్జింగ్ యాజమాన్యం

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..భద్రాచలంలో యువకుడిని కొట్టి చంపిన లాడ్జింగ్ యాజమాన్యం

భద్రాచలంలో రామాలయం ఏరియాలో అర్ధరాత్రి సమయంలో లాడ్జి అద్దె విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరకు ఓ యువకుడి ప్రాణా లను బలిగొంది. రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి లాడ్జింగ్ వద్ద యువకుల మధ్య జరిగిన ఘర్షణలో తెల్లం శరత్ (25)అనే యువకుడు మృతి చెందాడు.

రూమ్ అద్దె, ఆధార్ కార్డు, రేషన్ కార్డు విషయంలో మొద లైన వివాదం ..లాడ్జి సిబ్బంది పిడి గుద్దు లతో దాడి చేయడం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శరత్.కు అక్సి డింట్ ఆయందని చిత్రీకరించేందుకు లాడ్జ్ నిర్వాహకులు తెల్లం శరత్‌ను ఆసుపత్రికి తరలిం చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

భద్రాచలంలో జొమాటోలో పనిచేస్తున్న తెల్లం శరత్ వద్దకు హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు రావడంతో.. వారంతా కలిసి లాడ్జిలో రూమ్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న యువకులు రూమ్ కావాలని అడగగా.. లాడ్జి నిర్వాహకులు 600 రూపాయలు అద్దెగా చెప్పినట్లు సమాచారం. అయితే 500 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.