ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి…

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి…

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్‌-బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి సుమారు 100 మీటర్ల దిగువన నీటిలో పడిపోయింది.

మంగళవారం గూలర్‌ బజార్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు.

బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు…..