దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు పెంపు

అమూల్ పాల ధరలను 4–5 శాతం పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. నవంబర్ 12 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. అమూల్ తాజా లీటర్‌పై రూ.2, గోల్డ్ లీటర్‌పై రూ.4 పెరగనుంది.

పశువుల మేత, దాణా, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమూల్ వెల్లడించింది. పెంపు ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర అందించనున్నట్లు తెలిపింది.