భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….పీఎం మెమెంటోస్ వేలం గడువు పొడిగింపు
ప్రధానమంత్రికి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి సంబంధించిన ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత వేలం గడువును ఈనెల 31వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది.
ఈ ఆన్లైన్ వేలంలో 30 రకాల జ్ఞాపికలు, కానుకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది, దీని ప్రాథమిక ధర రూ.10 లక్షలు.

అత్యధికంగా జగన్నాథ పరివార రథం ప్రతిమకు రూ.21 లక్షల బేస్ ప్రైస్ ఉంది. వేలం ఆదాయాన్ని ‘నవామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నారు…