భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…: శ్రీమాత అనుగ్రహం , సర్వరోగ నివారణ ఐశ్వర్యం ఉన్నత స్థితి కోసం కంచి క్షేత్ర శ్రీ కామాక్షి దేవీ ధ్యానం
కంచిక్షేత్ర శ్రీ కామాక్షి దేవీ ధ్యానo
ఓం
ఐక్షవధన్వ శరపాశాంకుశ కరగ్రాహ్యై నమస్తేస్తు |
ప్రసన్నే పద్మనేత్రే పద్మనాభ సహోదరి |
కృపాకటాక్ష వర్షిణ్యై కామాక్ష్యై సతతం నమః ||
రాజరాజేశ్వరీం వందే కాంచీపుర నివాసినీమ్ |
చతుర్భుజాం త్రినేత్రాం చ పాశాంకుశ శరాసనామ్ ||
రూప వర్ణన
చెరకు విల్లు, పుష్ప బాణాలు, పాశము, అంకుశములను తన నాలుగు చేతులలో ధరించిన ఓ కామాక్షి మాతా! నీకు నమస్కారము. ప్రసన్నమైన వదనము, పద్మముల వంటి నేత్రములు కలిగి, ఆ శ్రీమహావిష్ణువుకు సోదరియై, భక్తులపై నిరంతరం కృపాకటాక్షాలను కురిపించే జగన్మాతకు ప్రణామములు. కంచీపురంలో నివాసముంటూ, మూడు కన్నులతో, నాలుగు చేతులతో రాజరాజేశ్వరిగా వెలుగోoదుతున్న ఆ కామాక్షి దేవిని మనస్ఫూర్తిగా వందిస్తున్నాను.
కంచిలో అమ్మవారు పద్మాసనస్థురాలై, నాలుగు హస్తాలతో—చెరకు విల్లు, పుష్ప బాణాలు, పాశం, అంకుశం ధరించి, త్రినేత్రాలతో దర్శనమిచ్చే ఆ మూల స్వరూపo.
ధ్యాన ఫలం
*మూలరూప దర్శన భాగ్యము (అమ్మవారి నిత్య సన్నిధి అనుభూతి)
*సర్వ రోగ నివారణ (శారీరక, మానసిక క్లేశాలు తొలగడం)
*సకల ఐశ్వర్య సిద్ధి (గృహంలో లక్ష్మీకటాక్షం స్థిరంగా ఉండడం)
*ఆధ్యాత్మికోన్నతి ప్రదాత (చిత్తశుద్ధి, మోక్ష మార్గం సుగమం కావడం)

శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏