భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంకృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం..
పెనమలూరులో సంచలన భూ కుంభకోణం – 5 గురు అరెస్ట్ – డి.ఎస్.పి ధర్మేంద్ర వెల్లడి
పెనమలూరు మండలం కానూరు పరిధిలో సర్వే నెంబర్ 36 లో జరిగిన సంచలన భూ కుంభకోణం గుట్టును పెనమలూరు పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి 5 గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి ధర్మేంద్ర పత్రికా ప్రకటనలో తెలిపారు.
విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావు దంపతులకు కానూరులో 1600 గజాల స్థలం ఉంది. వారి కుమార్తె హిమబిందు అమెరికాలో ఉంటున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకున్న విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ ముఠా 800 గజాల స్థలాన్ని కాజేయాలని ప్లాన్ వేసింది.
ముందుగా బాధితుడి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీని సంపాదించి, బతికున్న సుబ్బారావు దంపతులు చనిపోయినట్లుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను జిరాక్స్ సెంటర్ లోనే సృష్టించారు.
అమెరికాలో ఉన్న అసలు కుమార్తె స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళను తీసుకొచ్చి ఆమె పేరిట నకిలీ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తయారు చేశారు.

ఆ మహిళ ఆధార్ తో ఈ ఏడాది జనవరిలో మందాడి ఆదిరెడ్డి పేరుతో GPA, ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.
అయితే స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అసలు యజమాని సుబ్బారావుకు అనుమానం వచ్చి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అరెస్ట్ అయిన నిందితులు:
మైనంపాటి మణికుమార్ (ప్రధాన సూత్రధారి),మందాడి ఆదిరెడ్డి
,ఉప్పల భాస్కరరావు,RMP శివ
,కాసాని అమలేశ్వరరావు
ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని డి.ఎస్.పి ధర్మేంద్ర ,తెలిపారు. కేవలం జిరాక్స్ కాపీతోనే కోట్ల విలువైన స్థలాలను కాజేస్తున్న ఇలాంటి ముఠాల పట్ల NRIలు, తమ స్థలాలకు దూరంగా ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ పత్రికా సమావేశంలో పెనమలూరు సీఐ వెంకటనారాయణ ,ఎస్సై సుధాకర్ , ఎస్సై సందీప్ ,మరియు సిబ్బంది పాల్గొన్నారు.