విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాల ప్రిన్సిపాల్
(భారత్ డిజిటల్ న్యూస్ )పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.శాడిస్ట్ నైజంతో విపరీత ధోరణితో వ్యవహరిస్తూ బావి భారత పౌరులైన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు లేక మూడు నెలలు గడుస్తున్నా దానిపైన పట్టించుకోవడం లేదు.ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలై ఐదు నెలలు కావస్తున్న విద్యార్థులకు ఇవ్వకుండా ఫీజులు కడితేనే రసీదు చూపించేనే ఇస్తామని చెప్పడం సైకో మనస్తత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ కళాశాలకు వెళ్లే విద్యార్థులంతా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. టీసీలు అడిగితే తన చుట్టూ రోజుల తరబడి తిప్పడం అధ్యాపకురాలకు తగినదేనా అని ప్రశ్నిస్తున్నారు.గతంలో ఇదే ప్రిన్సిపాల్ సస్పెండ్ అయి తరవాత విధులలోకి చేరారు. ఈ ప్రిన్సిపాల్ ధోరణితో గతం లో పనిచేసిన కళాశాలలో అనేక ఆరోపణలతో సస్పెండ్ అయ్యి తర్వాత బదిలీ అయి పాకాలకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తన ధోరణి మార్చుకోలేదు. విసుగెత్తిన విద్యార్థులు చంద్రగిరి శాసనసభ్యులకు ఫిర్యాదు చేశారు. ఆమె ధోరణి విద్యార్థులకు కాకుండా అధ్యాపకులకు కూడా తలనొప్పిగా మారింది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే వారి ఆవేదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కళాశాల పట్ల ప్రజలకు సానుకూల స్పందన రావాలని అడ్మిషన్లు పెరగాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇలాంటి వారి వలన ప్రభుత్వ కళాశాలల అడ్మిషన్లు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది.కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాకాల డిగ్రీ ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
