భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో ‘స్థానిక’ ఎన్నికలు వాయిదా పడవు: లోకేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :
ఏపీలో అక్టోబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికలు జరగవనే అపోహలు ఎవరికీ వద్దని మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా పడాలన్న వైసీపీ కుయుక్తులు పనిచేయవని అన్నారు. కోర్టులో పెండింగులో ఉన్నవి కూడా త్వరగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి పొత్తుల పై కోఆర్డినేషన్ కమిటీ, అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
