తెలంగాణలో 200 కొత్త కోర్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో 200 కొత్త కోర్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 594 కొత్త కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు ప్రతిపాదనలు పంపగా, తొలిదశలో 200 కోర్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.