భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రంగారెడ్డిలో 13 కిలోల జింక మాంసం పట్టివేత
రంగారెడ్డి: జింక మాంసం అక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో ఎస్‌వోటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా మాంసం పట్టుబడింది. రాయికల్ టోల్‌ప్లాజా వద్ద రెండు వాహనాలను పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో సుమారు 13 కిలోల జింక మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఎయిర్‌గన్ లభించింది. దీంతో వాహనాల్లో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు జింక మాంసం, ఎయిర్‌గన్‌తో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు. జింకను ఎక్కడ వేటాడారు? మాంసాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అదుపులో ఉన్న వారిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.